Sat Mar 21 2026 08:46:50 GMT+0530 (India Standard Time)
ఈరోజు బంగారం ధరలు ఇలా...?
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతకొద్ది రోజులుగా తగ్గుతూ, స్థిరంగా ఉన్న బంగారం రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతకొద్ది రోజులుగా తగ్గుతూ, స్థిరంగా ఉన్న బంగారం రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరల పెరుగుదల తప్పదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. జ్యుయలరీ షాపులు సయితం బంగారం కొనుగోళ్ల దారులతో కిటకిట లాడుతున్నాయి.
మార్కెట్ లో....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,520 రూపాయలుగా ఉంది. పది గ్రాములపై నిన్నటి కంటే రూ.200 ల వరకూ పెరిగింది. కిలో వెండి ధర రూ.800 రూపాయలుగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి 63,115 రూపాయలుగా ఉంది.
Next Story

