Sat Mar 21 2026 22:11:50 GMT+0530 (India Standard Time)
పెరిగింది స్వల్పంగానే... కొనుగోలు చేయొచ్చు
ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో, తగ్గుతాయో చెప్పలేం. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదంటారు. గత కొంతకాలంగా దేశంలో బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. భారీగా పెరగడం, తగ్గడం లేకుండా స్వల్పంగానే ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలం పాటు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగాయి. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లోని ఒడిదుడుకులపై ఆధారపడి ఉండటంతో నిపుణులు సయితం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ధరలు ఇలా....
ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,460 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,600 రూపాయలుగా ఉంది.
Next Story

