Sat Mar 21 2026 23:52:14 GMT+0530 (India Standard Time)
బ్యాడ్ న్యూస్ ....బాగా పెరిగిన బంగారం ధరలు
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరింత పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

బంగారం అంతే మరి. పెరగకుండా ఉంటేనే సంతోషపడాలి. బంగారానికి ఉన్న డిమాండ్ తో ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉంటాయి. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు కూడా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపుతాయి. బంగారం ధర ఎక్కువగా తగ్గుతుందని ఆశ పెట్టుకోవద్దని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. తాజాగా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరింత పెరిగాయి.
హైదరాబాద్ లో....
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,700 రూపాయలకు చేరకుంది. అంటే నిన్నటి కంటే పదిగ్రాములపై మూడు వందలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.430 లకు పెరిగి 49,850 రూపాయలకు చేరుకుంది.
Next Story

