Sun Feb 01 2026 23:22:01 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ పెరిగిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.400 నుండి రూ.430..

బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఒకరోజు తగ్గితే.. మరోరోజు అంతకు రెట్టింపుగా బంగారం ధర పెరుగుతుంటుంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో.. బంగారం కొనుగోలుకు డిమాండ్ ఏర్పడింది. రేటు ఎంతైనా.. కొనేందుకు వెనుకాడట్లేదు కొనుగోలుదారులు. తాజాగా బంగారం ధర మళ్లీ పెరిగగా.. వెండి ధర మాత్రం కాస్త తగ్గింది.
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.400 నుండి రూ.430 వరకూ పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.48,200 కి చేరగా.. 24 క్యారెట్ల ధర రూ.52,580కి పెరిగింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా.. విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇవే ధరలున్నాయి.
Next Story

