Thu Mar 19 2026 10:25:52 GMT+0530 (India Standard Time)
మళ్లీ పెరిగిన బంగారం వెండి, ధరలు.. తాజా ధరల వివరాలివిగో !
దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళలలో..

న్యూ ఢిల్లీ : పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. రెండ్రోజులుగా మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరపై రూ.600, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.660 మేర బంగారం ధరలు పెరిగాయి. అలాగే కిలో వెండి ధర రూ.500 మేర పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళలలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,750కిపెరగగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,090కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.48,350, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉండగా.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో.. కిలో వెండి ధర రూ.61,600కి చేరింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.61,600 ఉండగా.. చెన్నై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.66,100 గా ఉంది.
Next Story

