Tue Jan 20 2026 17:58:04 GMT+0000 (Coordinated Universal Time)
వరుసగా ఏడో రోజూ తగ్గిన బంగారం, వెండి ధరలు
పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు తగ్గడం.. పసిడి ప్రియులకు గోల్డెన్ న్యూసే. తాజాగా శనివారం కూడా 22 క్యారెట్స్ ..

కొనుగోలు దారులకు ఇది నిజంగా శుభవార్తే. ఎప్పుడూ పైపైకి ఎగబాకే బంగారం ధరలు వారంరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు తగ్గడం.. పసిడి ప్రియులకు గోల్డెన్ న్యూసే. తాజాగా శనివారం కూడా 22 క్యారెట్స్ గోల్డ్పై రూ. 100 వరకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్థిరంగానే ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.500 తగ్గింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధరపై రూ. 500 తగ్గడంతో.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.68,300కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.70,900 గా ఉంది.
Next Story

