Mon Mar 16 2026 18:38:53 GMT+0530 (India Standard Time)
భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. బులియన్ మార్కెట్లో

బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,670గా ఉంది. గత 24 గంటలలో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 250.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 280 తగ్గింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర శుక్రవారం రూ. 73,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. హైదరాబాద్లో రూ. 76,200లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,200ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా.. చెన్నైలో రూ. 76,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,250 గా నమోదైంది.
Next Story

