Fri Dec 05 2025 20:18:44 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం
నేడు గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతాయి

నేడు గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతాయి. ఉత్తర్ ప్రదశ్ లో రెండో దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. పోలింగ్ ఇప్పటికే ప్రారంభమయింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో మంచు కురుస్తున్నందును పోలింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. ఇంకా ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోలేదు.
గోవాలో ప్రత్యేక కేంద్రాలు...
నలభై నియోజకవర్గాలున్న గోవాలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 301 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ మహిళా ఓటర్ల కోసం 105 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోవాలో మొత్తం 11 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి గోవాలో పోటీ అనేక పార్టీల మధ్య ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇక్కడ బరిలోకి దిగింది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, టీఎంసీ వంటి పార్టీలు బరిలో ఉన్నాయి.
మంచు కారణంగా....
ఉత్తరాఖండ్ లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 82 లక్షల మంది వరకూ ఓటర్లుంటారు. అయితే మంచు విపరీతంగా కురుస్తుండటంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పోలింగ్ సమయాన్ని పెంచనున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న రెండో దశ ఎన్నికల్లో మొత్తం 55 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 55 స్థానాలకు 586 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం మూడు రాష్ట్రాల్లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది.
- Tags
- goa
- uttarakhand
Next Story

