Sun Mar 08 2026 06:01:21 GMT+0530 (India Standard Time)
గులాం నబీ ఆజాద్ రాజీనామా
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు

గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. జమ్ము కశ్మీర్ ప్రచార కమిటీ చీఫ్ పదవికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన గంటల్లోగానే ఆజాద్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొద్ది గంటల్లోనే....
తన ఆరోగ్య కారణాల రీత్యా ఈ కొత్త బాధ్యతలను తీసుకోలేనని ఆయన తెలిపారు. ఈ పదవి తీసుకోవడం పట్ల ఆయన విముఖత చూపారు. నిన్న గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ హైకమాండ్ జమ్ము కశ్మీర్ ప్రచార కమిటీ చీఫ్ గా నియమించింది. అయితే తాను ఈ పదవిలో ఉండలేనని ఆయన పేర్కొన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story

