Fri Dec 05 2025 13:44:11 GMT+0000 (Coordinated Universal Time)
నేడు దేశ వ్యాప్త సమ్మె
దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను నిరసిస్తూ నాలుగు జాతీయ కార్మిక సంఘాలు నేడు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి. కార్మిక చట్టాల రద్దు, నాలుగు కొత్త లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టడాన్ని జాతీయ కార్మిక సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి.
నాలుగు కార్మిక సంఘాలు...
ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ లు సమ్మెకు పిలుపు నిచ్చాయి. ఉదయం ఎనిమిది గంటల పనిదినాలను పది గంటలకు పెంచుతూ వచ్చిన జీవోను కూడా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సింగరేణి లోనూ సమ్మె ప్రభావం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట కార్మికుల ఆందోళన కు దిగి లేబర్ కోడ్ లు రద్దు చేయాలంటూ కార్మికుల డిమాండ్ చేస్తున్నారు.
Next Story

