Thu Mar 19 2026 07:33:46 GMT+0530 (India Standard Time)
పన్నీర్ అవుట్.. కీలక నిర్ణయం
అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వంను తప్పిస్తూ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది.

అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వంను తప్పిస్తూ సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది. పన్నీర్ ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రత్యేక తీర్మానం చేసింది. పార్టీ పదవులే కాకుండా ప్రాధమిక సభ్యత్వాన్ని కూడా తొలగించింది. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన మద్దతుదారులను కూడా పదవుల నుంచి పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది.
పన్నీర్ ను పార్టీ....
దీంతో అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వంను బయటకు పంపినట్లే అవుతుంది. గత కొంతకాలంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. పళనిస్వామి శాసనసభ పక్ష నేతగా కొనసాగుతున్నారు. పన్నీర్ సెల్వం తనకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. అందుకు పళనిస్వామి అంగీకరించడం లేదు. పన్నీర్ కు పార్టీలో కీలక పదవి ఇస్తే శశికళ సులువుగా ఎంట్రీ ఇస్తుందన్న అనుమానంతో ఆయనను దూరంగా ఉంచాలని నిర్ణయించారు. దీంతో పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

