Thu Dec 18 2025 13:46:15 GMT+0000 (Coordinated Universal Time)
అదానీకి రాజ్యసభ సీటు? ప్రచారానికి తెరదింపిన సంస్థ
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కూడా ఒకరు. కొంతకాలంగా అదానీ రాజకీయాల్లోకి వస్తారని, ఆయనకు రాజ్యసభ సీటు..

అమరావతి : ఇటీవలకాలంలో పలువురు వ్యాపారవేత్తలు, సినీ నటులు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కూడా ఒకరు. కొంతకాలంగా అదానీ రాజకీయాల్లోకి వస్తారని, ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రచారానికి అదానీ సంస్థ తెరదింపుతూ ఒక ట్వీట్ చేసింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు, అదానీ లేదా అతని భార్య ప్రీతి అదానీకి రాజ్యసభ సీటు ఖాయమంటూ వస్తున్న మీడియా కథనాల్లో వాస్తవం లేదని అదానీ సంస్థ స్పష్టం చేసింది. నిజానికి అదానీ కుటుంబంలో ఎవరికీ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని, గౌతమ్ అదానీ ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని తెలిపింది.
Next Story

