Mon Mar 23 2026 14:53:45 GMT+0530 (India Standard Time)
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడుతోంది

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడుతోంది. దీంతో రీఫిల్లింగ్ మొత్తాన్ని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వ రంగ చమురు కంపెనీలున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ల సరఫరా చేస్తుండగా.. దానిని 10 కేజీలకు తగ్గించాలని చూస్తున్నట్లు సమాచారం.
తక్కువ కేజీలకు...
గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ ను పొదుపుగా వాడలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఇందుకు ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని కూడా కోరుతుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ స్టవ్ లను వినియోగించాలని చెబుతోంది.
Next Story

