Wed Apr 01 2026 12:14:10 GMT+0530 (India Standard Time)
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
నేటి నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగనున్నాయి

నేటి నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగనున్నాయి. చమురు సంస్థలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఒకటో తేదీ కావడంతో చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురుసంస్థలు గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాయి.
కమర్షియల్ సిలిండర్ ధరలు...
ఈరోజు కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్లో రూ.214.50 కమర్షియల్ సిలిండర్ పెరిగింది. హైదరాబాద్ లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,321 లకు చేరుకుంది. పెరిగిన ఛార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.
Next Story

