Thu Mar 19 2026 12:38:12 GMT+0530 (India Standard Time)
బిపిన్ రావత్ అంత్యక్రియలు నేడు
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్న వెల్లింగ్టన్ నుంచి 13 మంది ఆర్మీ అధికారుల మృతదేహాలను ఢిల్లీకి తరలించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ తో పాటు అనేక మంది ప్రమాదంలో మరణించి వారి భౌతిక కాయాలకకు నివాళులర్పించారు.
అధికారిక లాంఛనాలతో...
ఈరోజు ఢిల్లీలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అంత్యక్రియలు జరగనున్నాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కొందరు మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్ కు పంపారు. ఫలితాలు వచ్చిన వెంటనే వాటిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
Next Story

