Sun Mar 15 2026 15:45:30 GMT+0530 (India Standard Time)
రేపు బిపిన్ రావత్ అంత్యక్రియలు
ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రభుత్వం బిపిన్ రావత్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈరోజు ఆర్మీ విమానంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక పార్ధీవ దేహాలను ఢిల్లీకి తరలించనున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రేపు ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకూ ఉంచుతారు.
అంతిమ యాత్ర.....
ప్రజలు, బంధువులు, సన్నిహితులు నివాళులర్పించిన తర్వాత ఆయన ఇంటి నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోని శ్మశాన వాటిక వరకూ అంతిమ యాత్ర కొనసాగనుంది. నిన్న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మరో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.
Next Story

