Sun Dec 14 2025 11:25:19 GMT+0000 (Coordinated Universal Time)
దావోస్ పర్యటనకు నలుగురు ముఖ్యమంత్రులు
వచ్చే నెలలో దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి నలుగురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు

వచ్చే నెలలో దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి నలుగురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలతో కలిసి వారు పాల్గొననున్నారు. జనవరి 19వ తేదీ నుంచి 23 వతేదీ వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ఈ వార్షిక సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సుమారు 130 దేశాల నుంచి దాదాపు 3,000 మంది ప్రపంచ నేతలు, అందులో సుమారు 60 మంది దేశాధినేతలు పాల్గొంటున్నారు.
పెట్టుబడుల కోసం...
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోహన్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా దావోస్లో సమావేశంలో పాల్గొనే అవకాశముంది. పెట్టుబడుల కోసం తమ రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు వీలుగా ప్రతి ఏటా దావోస్ లో ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలను వారు వివరించనున్నారు.
Next Story

