Sat Dec 06 2025 07:47:40 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ కేంద్రమంత్రి శాంతిభూషణ్ మృతి
మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ మృతి చెందారు.

మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ మృతి చెందారు. 97 ఏళ్ల వయసున్న ఆయన నిన్న రాత్రి మరణించారు. సీనియర్ అడ్వొకేట్ ఆయన ఎన్నో కేసులను వాదించారు. అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఆయన ఒకరిగా పేరు పొందారు. మొరార్జీ దేశాయ్ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు.
సీనియర్ న్యాయవాదిగా...
1925 నవంబరు 11న ఉత్తర్‌ప్రదేశ్ లోని బజ్నోర్ లో శాంతిభూషణ్ జన్మించారరు. ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్ కూడా సీనియర్ న్యాయవాదే. 1977 నుంచి 1979 మధ్య కాలంలో శాంతి భూషణ్ కేంద్ర న్యాయశాఖమంత్రిగా వ్యవహరించారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ రాజ్‌నారాయణ్ తరుపున అలహాబాద్ కోర్టులో వాదనలను వినిపించిన శాంతిభూషణ్ ఫేమస్ అయ్యారు. 1980లో బీజేపీలో చేరారు. అనంతరం బయటకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో శాంతిభూషణ్ ఒకరు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

