Sat Dec 13 2025 19:19:48 GMT+0000 (Coordinated Universal Time)
టిక్కెట్ ఇవ్వకుంటే అందరూ ఉరేసుకుంటామంటున్నారు
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ తనకే ఇవ్వాలన్నారు

మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ జలీల్ ఖాన్ కోరారు. లేదంటే ముస్లింలు ఉరేసుకుంటారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తనదేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో పాటు ముస్లింలపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
తనకే ఇవ్వాలని...
విజయవాడ వెస్ట్ టిక్కెట్ ను అందరూ అడుగుతున్నారని, కానీ ఇక్కడ గెలవగల సత్తా తనకు మాత్రమే ఉందని జలీల్ ఖాన్ తెలిపారు. తమ కుటుంబానికి ఇక్కడ ఉన్న పట్టును గుర్తించి టిక్కెట్ ఇవ్వాలని ఆయన టీడీపీ హైకమాండ్ ను డిమాండ్ చేశారు. జలీల్ ఖాన్ 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన కూమార్తె ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Next Story

