Sat Dec 06 2025 09:49:26 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతి
మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ గురువారం ఢిల్లీలోని తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను గురుగ్రామ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు అయితే అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. రాత్రి 10.19 గంటలకు శరద్ యాదవ్ మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
సోషలిస్టు నేతగా...
ప్రముఖ సోషలిస్టు నేతగా శరద్ యాదవ్ గా పేరుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన తన రాజకీయజీవితానని ప్రారంభించారు. జేడీయూను స్థాపించారు. 2015లో జేడీయూ, ఆర్జేడీ మహాకూటమిలో ప్రధాన భాగమయ్యారు. వాజ్పేయి, వీపీ సింగ్ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఏడు సార్లు లోక్సభ సభ్యుడిగా శరద్ యాదవ్ ఎన్నికయ్యారు. బీజేపీతో చేతులు కలపడంతో నితీష్ కుమార్ నుంచి విడిపోయి బయటకు వచ్చి 2018లో తాంత్రిక్ జనతాదళ్ పార్టీని స్థాపించారు. తర్వాత దానిని ఆర్జేడీలో విలీనం చేశారు. శరద్ యాదవ్ మృతిపట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

