Wed Feb 04 2026 00:34:43 GMT+0000 (Coordinated Universal Time)
మసాజ్ వ్యవహారంలో ట్విస్ట్
తీహార్ జైలులో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వ్యవహారం మరో మలుపు తిరిగింది.

తీహార్ జైలులో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకూ సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేస్తుంది ఫిజియో థెరపిస్టు అని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తుంది. కానీ ఆ వాదనలను తీహార్ జైలు అధికారులు తోసి పుచ్చారు.
ఫిజియోథెరపిస్ట్ కాదని...
వీడియోలో సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేస్తున్న వ్యక్తులు తోటి ఖైదీలని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇరకాటంలో పడింది. తీహార్ జైలులో సకల సౌకర్యాలను సత్యేంద్ర జైన్ అనుభవిస్తున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

