Tue Mar 17 2026 04:14:36 GMT+0530 (India Standard Time)
పుల్వామా దాడి మోదీ పుణ్యమే : సత్యపాల్ మాలిక్
మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి ప్రధాని మోదీ వల్లనే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు

మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి ప్రధాని నరేంద్ర మోదీ వల్లనే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. సత్యపాల్ మాలిక్ గతంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత ఆ పదవి నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు.
హెలికాప్టర్లు అడిగితే...
పుల్వామా దాడి మోదీ పుణ్యమేనంటూ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుల్వామా దాడి జరిగినప్పుడు జవాన్లని తీసుకెళ్లడానికి మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఐదు హెలికాప్టర్లు అడిగితే అందుకు ప్రభుత్వం నిరాకరించిందని సత్యపాల్ మాలిక్ తెలియజేశారు. అందువల్లనే రహదారిపై వెళుతూ జవాన్లు మరణించారని తెలిపారు. మోదీ, అజిత్ దోవల్లు ఇద్దరూ తనను దీనిపై మాట్లాడొద్దని అప్పట్లో కోరారని కూడా సత్యపాల్ మాలిక్ ఇప్పుడు చెబుతుండటం విశేషం.
Next Story

