Fri Dec 05 2025 23:22:53 GMT+0000 (Coordinated Universal Time)
ఫైర్ అయిన ధోని భార్య.. ఎందుకనుకుంటున్నారా..?
ఝార్ఖండ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు..

జార్ఖండ్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్న సంగతి తెలిసిందే..! చాలా రాష్ట్రాల్లో కరెంట్ సరిగా లేకపోవడం కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. జార్ఖండ్లో విద్యుత్ సంక్షోభంపై భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ జార్ఖండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జార్ఖండ్లో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై సాక్షి ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు నెలకొందని ఆమె ప్రశ్నించారు.
"As a taxpayer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years? We are doing our part by consciously making sure we save energy!" అంటూ సాక్షి ధోనీ ట్వీట్ చేశారు. ''ఒక ట్యాక్స్ పేయర్ గా (పన్ను చెల్లింపుదారు)గా అడుగుతున్నాను.. ఎన్నో సంవత్సరాలుగా ఝార్ఖండ్ లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? విద్యుత్ ను ఆదా చేయడానికి మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. అయినా.. విద్యుత్ సంక్షోభం ఉంది'' అని సాక్షి ధోనీ ట్వీట్ చేశారు.
దేశంలోని పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఉందన్న నివేదికల మధ్య సాక్షి ఈ ట్వీట్ చేశారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు.. రాష్ట్రంలో వేడిగాలులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 28 వరకు గిర్ధి, తూర్పు సింగ్భూమ్, పశ్చిమ సింగ్భూమ్, రాంచీ, బొకారో, కోడెర్మా, పాలము, గర్వా, ఛత్ర జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని తెలిపారు. మరోవైపు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ సోమవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణతో సమావేశమయ్యారు. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు రవాణాను పెంచాలని సూచించారు. విద్యుత్ సంక్షోభంపై ప్రశ్నించిన ఆమెకు మద్దతు తెలుపుతూ పలువురు నెటిజన్ లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Next Story

