Fri Dec 05 2025 17:33:42 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : పాక్ దాడులకు దిగుతుంది.. భారత్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది
ఈరోజు జరిగిన దాడులపై విదేశాంగ శాఖ,రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి

ఈరోజు జరిగిన దాడులపై విదేశాంగ శాఖ,రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈరోజు జరిగిన ఘటనలపై దేశ ప్రజలకు వివరించారు. భారత్ సరిహద్దు ప్రాంతాలైన పదిహేను చోట్ల పాకిస్తాన్ దాడులకు దిగిందని తెలిపారు. అయితే భారత్ ఆర్మీ పాక్ మిసైళ్లను సమర్థవంతంగా కూల్చివేసిందని తెలిపారు. ఉత్తర, పశ్చిమ భారత్ లోని పదిహేను ప్రాంతాల్లో దాడులకు దిగిందని చెప్పారు. భారత్ లోని పలు ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగిందని తెలిపారు. అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, భుజ్, పలోడి. నాల్, చండీగఢ్, భఠిండా, ఆదామ్ పూర్, పటాన్ కోట్, జమ్మూ, శ్రీనగర్, అవంతిపురలలో దాడులకు దిగిందని వారు వివరించారు.
పదహారు మంది అమాయకులు...
పాకిస్తాన్ దాడులలో పదహారు మంది అమాయకులు మరణించారని తెలిపారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులున్నారని చెప్పారు. భారత్ భూభాగంలో పడినవి పాక్ కు చెందిన ఆయుధాల శకాలేనని తేలిందన్నారు.పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందని తెలిపారు. పాక్ మంత్రులు పాక్ లో ఉగ్రవాదులు ఎవరూ లేరని నిసిగ్గుగా ప్రకటించుకుంటున్నారని అన్నారు. దీనికి ప్రతీకారంగా లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రద్దు చేశామని వివరించారు. భారత్ అతిక్రమణలకు దిగుతుందని పాక్ తప్పుడు ప్రచారానికి దిగుతుందని అన్నారు. మనం చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవని తెలిపారు. పాక్ లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని ప్రపంచమంతా తెలుసునని చెప్పారు.
ఆధారాలను ఐక్యరాజ్యసమితికి...
పాకిస్తాన్ కు వ్యతిరేంగా ఉన్నఆధారాలను ఐక్యరాజ్యసమితికి అందించామని చెప్పారు. అంతర్జాతీయ సమాజాన్ని పాక్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. తాము ఎన్నో సాక్షాలను పాక్ కు అందించినా అది మాత్రం తన వైఖరిని వీడలేదన్నారు. మన వద్ద కాల్ రికార్డులతో పాటు ఇతర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. అందుకే పాకిస్తాన్ మతపరమైన ప్రాంతాల్లో దాడులు చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తుందని, అయితే అందులో నిజం లేదని, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగిందని వారు వివరించారు. హహల్గామ్ దాడులపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని పాక్ కోరుతుందని అన్నారు. స్పష్టమైన ఆధారాలున్న ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలుపాక్ తీసుకోలేదని తెలిపారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పాక్ లో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. పాక్ మనదేశంలోని మూడు గురుద్వారాలపై దాడులు చేసిందని తెలిపారు. నియంత్రణ రేఖ వెంట పాక్ ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతుందని తెలిాపారు.
Next Story

