Fri Dec 05 2025 09:14:52 GMT+0000 (Coordinated Universal Time)
ల్యాప్ టాప్ ఆర్డర్ ఇస్తే 'ఘడీ' డిటర్జెంట్ సబ్బులు
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సైట్లలో భారీ ఆఫర్లలో ప్రోడక్ట్స్ ను అమ్ముతూ ఉన్నారు. అలా పలువురు తమకు కావాల్సిన వస్తువులను

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సైట్లలో భారీ ఆఫర్లలో ప్రోడక్ట్స్ ను అమ్ముతూ ఉన్నారు. అలా పలువురు తమకు కావాల్సిన వస్తువులను కొనుక్కుంటూ ఉన్నారు. అలా ఓ వ్యక్తి ల్యాప్ టాప్ ఆర్డర్ ఇవ్వగా అతడికి డిటర్జెంట్ సబ్బులు రావడంతో అవాక్కయ్యాడు. "ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ స్థానంలో డిటర్జెంట్ పంపింది, కానీ వారి కస్టమర్ సపోర్ట్ నన్నే నిందిస్తోంది. నా దగ్గర CCTV ఆధారాలు ఉన్నాయి," అని ఢిల్లీ వ్యక్తి లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఆరోపించారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తన తండ్రికి ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశానని, అయితే తన తండ్రికి "ఓపెన్ బాక్స్" డెలివరీ కాన్సెప్ట్ గురించి సరిగ్గా తెలియదని యశస్వి శర్మ చెప్పారు.
ఐఐఎం గ్రాడ్యుయేట్ యశస్వి శర్మకు ఫ్లిప్‌కార్ట్ నుంచి లాప్ టాప్ బదులుగా ఘడి డిటర్జెంట్ సబ్బులు వచ్చాయని ఆరోపించాడు. ఫ్లిప్‌కార్ట్ తన తప్పును అంగీకరించడానికి నిరాకరించిందని కూడా యశస్వి ఆరోపించాడు. ఫిర్యాదు చేస్తే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ తననే నిందిస్తోందని వాపోయాడు. తన వద్ద సీసీటీవీ ఫుటేజీలున్నప్పటికీ అది వృథా అయిందని ఆరోపించాడు. వచ్చిన డెలివరీ ప్యాకేజీకి అంగీకరించడం తన తండ్రి తప్పిదమని కూడా పోస్ట్‌లో పేర్కొన్నాడు. తన తండ్రికి "ఓపెన్-బాక్స్" డెలివరీ గురించి తెలియదు. ఓపెన్ బాక్స్ డెలివరీ కాన్సెప్ట్ ప్రకారం, డెలివరీ చేసే వ్యక్తి ముందు బాక్స్‌ను తెరిచి, ఉత్పత్తిని జాగ్రత్తగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొనుగోలుదారు OTPని అందించాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్ బాక్స్ తెరవకుండానే వెళ్లిపోయిన సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ తన వద్ద ఉందని యశస్వి శర్మ చెప్పుకొచ్చాడు.
Next Story

