Tue Jan 20 2026 16:56:49 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విమానాశ్రయం మూసివేత.. తుపాను ఎఫెక్ట్
దానా తుపాను దెబ్బకు కొన్ని ఫ్లైట్లు కూడా రద్దయ్యాయి. భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో పూర్తిగా విమాన రాకపోకలు నిషేధం విధించారు

దానా తుపాను దెబ్బకు కొన్ని ఫ్లైట్లు కూడా రద్దయ్యాయి. భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో పూర్తిగా విమాన రాకపోకలు నిషేధం విధించారు. ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశఆరు. దానా దూసుకు వస్తుండటంతో ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చిరకతో భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేశారు. అనేక ఫ్లైట్లు రద్దయినట్లు అధికారులు తెలిపారు.
అందుకే మూసివేశాం...
కుండపోత వర్షంతో పాటు ఈదురుగాలులు కురిసే అవకాశముందని, 36 గంటల పాటు వాతావరణం సహకరించదని ఎయిర్ పోర్టు అధికారులు విమానాశ్రయాన్ని మూసివేశారు. ప్రయాణికులు కూడా తమకు సహకరించాలని కోరారు. రద్దయిన విమానాలకు సంబంధించిన సమాచాారన్ని ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి ఫోన్ల ద్వారా సమాాచారం అందించారు. ఇదే సమయంలో ఈ మార్గంలో అనేక రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
Next Story

