Mon Mar 16 2026 01:08:52 GMT+0530 (India Standard Time)
ఢిల్లీ - న్యూయార్క్ విమానం అత్యవసర ల్యాండింగ్
ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళుతున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు

ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళుతున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. ఫీడర్ లో సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులు అంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు.
మూడు వందల మందితో...
న్యూయార్క్ కు మూడు వందల మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు గాబరా పడ్డారు. కారణం తెలియక కొంత ఇబ్బంది పడ్డారు. చివరకు సాంకేతిక లోపం కారణమని భావించి ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

