Fri Dec 05 2025 09:01:17 GMT+0000 (Coordinated Universal Time)
703కోట్ల రూపాయలతో ఫ్లాట్ డీల్.. కొన్నదెవరు?
ఫార్మాస్యూటికల్ సంస్థ USV చైర్పర్సన్ లీనా గాంధీ తివారీ ముంబై

ఫార్మాస్యూటికల్ సంస్థ USV చైర్పర్సన్ లీనా గాంధీ తివారీ ముంబైలోని వర్లి ప్రాంతంలో సముద్రానికి ఎదురుగా ఉన్న రెండు విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లను 639 కోట్లకు కొనుగోలు చేశారు. స్టాంప్ డ్యూటీ, GST దాదాపు 63.9 కోట్లు ఖర్చు చేశారు, ఈ లావాదేవీ మొత్తం విలువ దాదాపు 703 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది దేశంలో నమోదైన అత్యంత ఖరీదైన నివాస ఆస్తి ఒప్పందంగా నిలిచింది.
లీనా తివారీ భారతదేశంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరు. ఫోర్బ్స్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు 3.9 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం USV కంపెనీ 75 దేశాలకు పైగా ఫార్మాస్యుటికల్ ప్రోడక్ట్స్ ని ఎగుమతి చేస్తోంది. ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో పట్టా పొందిన లీనా, బోస్టన్ యూనివర్శిటీ నుండి MBA పట్టా పొందారు.
Next Story

