Thu Mar 19 2026 15:01:54 GMT+0530 (India Standard Time)
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కాశ్మీర్ లోని రెండు వేర్వేరు ఎన్ కౌంటర్ లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్మూ కాశ్మీర్ లోని రెండు వేర్వేరు ఎన్ కౌంటర్ లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని తెలిసింది. మరణించిన ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ కమాండర్ జహీద్ వాని కూడా ఉన్నాడని చెబుతన్నారు.
నలుగురు పాకిస్థానీయులే....
కాశ్మీర్ లోని బుద్గాం జిల్లా చరర్ ఐ షరీఫ్ ప్రాంతంలో, పుల్వామా జిల్లాలోని వైరా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు పన్నెండు గంటల పాటు జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. వీరిలో నలుగురు లష్కరే తోయిబా, ఒకరు జైషే మహ్మద్ కు చెందిన వారుగా గుర్తించారు. ఒకరు తప్ప అందరూ పాకిస్థానియులే.
Next Story

