Sat Dec 13 2025 19:29:30 GMT+0000 (Coordinated Universal Time)
Bihar : బీహార్ ఎన్నిలకు పోటెత్తిన ఓటర్లు
బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

బీహార్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇస్తున్నారు. తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో దు గంటలకు వరకూ 60.13 శాతం శాతం ఓటింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు. అత్యధికంగా బెగూసరయ్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. తొలి విడతలో మొత్తం 121 స్థానాల్లో పోలింగ్.
రెండో విడత పోలింగ్...
తొలి విడత ఎన్నికల సందర్భంగా మొత్తం పద్దెనిమిది జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ 11న రెండవ విడత పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల కు సంబంధించి నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. అధికారులు పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

