ఉగ్రవాదంపై భారత్ పోరాటం ఆగదు: జైశంకర్
ఉగ్రవాదం విషయంలో భారత్ ఎల్లప్పుడూ దృఢమైన, రాజీలేని

ఉగ్రవాదం విషయంలో భారత్ ఎల్లప్పుడూ దృఢమైన, రాజీలేని వైఖరిని ప్రదర్శిస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల్లోనూ భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. కాల్పుల విరమణతో పాటు సరిహద్దుల్లో సైనిక చర్యలను నిలిపివేసేందుకు భారత్, పాకిస్థాన్ మధ్య ఒక అవగాహన కుదిరిందని మంత్రి జైశంకర్ వెల్లడించారు.
కాల్పుల విరమణకు భారత్ - పాకిస్తాన్ లు అంగీకరించాయని విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ చెప్పారు. కాల్పుల విరమణ ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అమలులోలోకి వచ్చిందని మిస్రి తెలిపారు. కాల్పుల విరమణను భారత్ కూడా అధికారికంగా ప్రకటించింది. ఎల్లుండి నుంచి తదుపరి చర్చలు ఇరు దేశాల మధ్య ఉంటాయని చెప్పింది. గత మూడు రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను నెలకొన్న నేపథ్యంలో భారత్ - పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది.

