Wed Jan 28 2026 16:57:28 GMT+0000 (Coordinated Universal Time)
తాజ్ ఎక్స్ప్రెస్ లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు
ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు.

ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తున్న తాజ్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే శాఖ తెలిపింది. తాజ్ ఎక్స్ ప్రెస్ లో రెండు కోచ్ లలో మంటలు చెలరేగడంతో రైలును నిలిపేశారు. రెండో కోచ్ లలో మంటలు రావడాన్ని గమనించిన సిబ్బంది రైలును నిలిపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మధ్యలోనే నిలిపేసి...
దీంతో తాజ్ ఎక్స్ ప్రెస్ ను తుగ్లకాబాద్-ఓఖ్లా మధ్య రైలును నిలిపి వేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ ప్రకటించింది. మంటలు అదుపు చేయడానికి ఆరు అగ్నిమాపక యంత్రాలు వచ్ాచయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే డీసీపీ తెలిపారు. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా గుర్తించారు.
Next Story

