Sat Dec 06 2025 14:27:27 GMT+0000 (Coordinated Universal Time)
దక్షిణ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో మంటలు
దక్షిణ ఎక్స్ప్రెస్ రైలుబోగీలో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి.

దక్షిణ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలో పగిడిపల్లి వద్ద శనివారం అర్థరాత్రి ఈ మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపేశారు. ప్రయాణికులు రైలు దిగి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
లగేజీ బోగీలో...
అయితే మంటలు అంటుకున్న బోగీ లగేజీ బోగీగా గుర్తించారు. వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలు వచ్చాయి. మంటలను ఆర్పాయి. ఘటనకు గల కారణంపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. ఈ మంటలంటుకోవడానికి కారణాలేంటి అన్న దానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story

