Sun Mar 15 2026 13:24:37 GMT+0530 (India Standard Time)
నేడు కేంద్ర బడ్జెట్
ఈరోజు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు

ఈరోజు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలిసి పది గంటలకు పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఉదయం 10.15 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్ ఆమోదించిన తర్వాత ఉదయం 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
అనువైన.. అనుకూల...
ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో వాటికి ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ ఉండనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు శ్రీలంక, పాక్ లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా బడ్జెట్ ను రూపొందించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా ఈ బడ్జెట్ లో అనేక వరాలు ఉంటాయన్న అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండనుందన్నది మరి కాసేపట్లో తేలనుంది. ఐదో సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.
Next Story

