Fri Dec 05 2025 11:32:49 GMT+0000 (Coordinated Universal Time)
దేశానికి మెరుగైన ప్రతిపక్షం అవసరం : నిర్మలా సీతారామన్
కాంగ్రెస్ నేతలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు.

కాంగ్రెస్ నేతలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ప్రతిపక్షాలకు సరైన అవగాహన లేదని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మాట్లాడుతూ, భారతదేశానికి సరైనన ప్రతిపక్షం మరియు మెరుగైన ప్రతిపక్ష నాయకులు అవసరం అని వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు “అసత్యాలు, వాస్తవాలపై ఆధారపడని వ్యాఖ్యలు” అని ఆమె తీవ్రంగా విమర్శించారు.
జీఎస్టీ పన్నుల విధానంలో...
2017లో ఏకీకృత పరోక్ష పన్ను విధానం అమలు సమయంలో నాలుగు స్లాబులు ఉంచిందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపించిన విషయాన్ని సీతారామన్ ఖండించారు.ఇటీవల జీఎస్టీ నిర్మాణాన్ని సరళీకరించి రెండు స్లాబులకు తగ్గించే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమకు న్యాయం జరిగిందని చెప్పుకోవడాన్ని కూడా ఆమె వ్యతిరేకించారు. పిటిఐతో ఇచ్చిన ఇంటర్వ్యూలో సీతారామన్, ప్రతిపక్షంపై తన విమర్శలను మరింత కఠినతరం చేశారు
Next Story

