Fri Dec 05 2025 13:57:06 GMT+0000 (Coordinated Universal Time)
తారలు స్పందించిన వేళ.. కోటి విరాళం
కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనపై సినీ తారలు స్పందిస్తున్నారు.

కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనపై సినీ తారలు స్పందిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది టాలీవుడ్, కోలీవుడ్ తారలు తమ విరాళాన్ని ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించగా, అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించారు. ప్రభాస్ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. వీరితో పాటు అనేక మంది వాయనాడ్ విలయం పట్ల స్పందిస్తూనే ఉన్నారు. తమకు తోచినంత విరాళాన్ని ప్రకటిస్తున్నారు.
వాయనాడ్ విలయానికి...
అయితే వాయనాడ్ విలయానికి దక్షిణాది హీరోయిన్లు స్పందించారు. దక్షిణాది హీరోయిన్లందరూ కలసి కోటి రూపాయలను తమ వంతుగా విరాళంగా ప్రకటించారు. దక్షిణాది తారలు సుహాసిని, కుష్బు, మీనా తదితరులు కేరళ వెళ్లి ఈ సాయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు అందించారు. కేరళలోని వాయనాడ్ లో జరిగిన విలయానికి 400 మంది మరణించిన సంగతి తెలిసిందే.
Next Story

