Sun Mar 15 2026 08:19:31 GMT+0530 (India Standard Time)
పూరీ జగన్నాధ ఆలయంలో బాణాసంచా పేలుడు ; 15 మందికి గాయాలు
పూరి జగన్నాధుడి ఆలయంలో బాణాసంచా పేలుడు సంభవించి పదిహేను మందికి గాయాలయ్యాయి.

పూరి జగన్నాధుడి ఆలయంలో బాణాసంచా పేలుడు సంభవించి పదిహేను మందికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి పూరి జగన్నాధ ఆలయంలో చందన ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా అక్కడ భక్తులు బాణాసంచా పేల్చారు. అయితే నిప్పురవ్వలు బాణాసంచా నిల్వ ఉంచిన ప్రాంతంలో పడి పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. వెంటనే మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
గాయపడిన వారిని...
దీంతో పెద్దయెత్తున అవి పేలడంతో పదిహేను మంది గాయాలపాలయ్యారు. వెంటనే అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పదిహేను మంది భక్తులకు గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు.
Next Story

