Fri Dec 05 2025 12:24:50 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ కాల్పుల్లో పదిహేను మంది భారత పౌరుల మృతి
పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో పదిహేను మంది భారత పౌరులు మరణించారు.

పాకిస్తాన్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. పహాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు నియంత్రణ వద్ద పాక్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పదిహేను మంది భారత పౌరులు మరణించారు. మరో నలభై మూడు మండి గాయపడినట్లు భారత్ ఆర్మీ వెల్లడించింది. పాక్ గత కొద్ది రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.
పూంచ్ సెక్టార్ లో...
పూంచ్ సెక్టార్ లో గత రాత్రి నుంచి పాక్ సైనికులు కాల్పులు జరిపాయి. భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహిస్తే పాకిస్తాన్ మాత్రం సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతుందని భారత్ ఆర్మీ తెలిపింది. పాక్ సైనికుల కాల్పలను తాము సమర్ధవంతంగా తిప్పికొడుతున్నామని తెలిపింది. నిరంతరం భారత సైన్యం అప్రమత్తంగా ఉందని, పౌరుల భద్రతకు తగిన చర్యలు తీసకుంటుందని చెప్పింది.
Next Story

