Fri Dec 05 2025 20:18:36 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లికొడుకుతో మాట్లాడమని నంబర్ పంపితే.. ఏం చేసిందో చూడండి !
తమ కంపెనీలో ఖాళీలు ఉన్నాయని చెప్పి రెజ్యూమ్ పంపించాలని కోరింది. అతని రెజ్యూమ్ చూసిన తర్వాత ఇంటర్వ్యూ లింక్..

బెంగళూరు : మ్యాట్రిమోనియల్ సైట్ల కారణంగా ఇప్పుడు చాలా వరకూ పెళ్లిళ్లు జరిగిపోతూ ఉన్నాయి. పెళ్లి సంబంధానికి వచ్చిన.. అబ్బాయిని ఏకంగా ఇంటర్వ్యూ చేసింది. బెంగళూరుకు చెందిన సాల్ట్ అనే కంపెనీ సహవ్యవస్థాపకురాలైన ఉదిత పాల్ అనే యువతికి పెళ్లి కాలేదు. ఆమెకు ఒక మ్యాట్రిమోనియల్ లింక్ పంపిన తండ్రి.. అబ్బాయితో మాట్లాడమని కూతురికి చెప్పాడు. ఆ లింక్ ద్వారా అబ్బాయిని సంప్రదించింది ఉదిత. పెళ్లి గురించి.. అభిప్రాయాల గురించి మాట్లాడుతూ.. ఏకంగా అతడి క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకుంది.
తమ కంపెనీలో ఖాళీలు ఉన్నాయని చెప్పి రెజ్యూమ్ పంపించాలని కోరింది. అతని రెజ్యూమ్ చూసిన తర్వాత ఇంటర్వ్యూ లింక్ పంపింది. ఈ విషయం ఉదిత తండ్రికి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టింది. అబ్బాయితో మాట్లాడమని చెప్తే.. ఇంటర్వ్యూ చేస్తావా? రెజ్యూమ్ తెప్పించుకొని, ఇంటర్వ్యూ లింక్ కూడా పంపావు. ఇప్పుడు వాళ్ల నాన్నకు నేను ఏం సమాధానం చెప్పాలి? అంటూ మండిపడ్డాడు. ఉదిత.. ''ఏడేళ్ల ఫిన్‌టెక్ అనుభవం ఉండటం చాలా గొప్ప విషయం. మా కంపెనీలో ఖాళీలు ఉన్నాయి. ఐయామ్ సారీ'' అంటూ రిప్లై ఇచ్చింది. ఈ చాట్‌ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. అతడు 62 ఎల్పీఏ ప్యాకేజ్ అడిగాడని, అంత పెట్టి హైర్ చేసుకోలేక ఉద్యోగం ఇవ్వలేదని సమాధానం చెప్పింది.
Next Story

