Fri Dec 05 2025 14:11:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రైతులు చలో ఢిల్లీ
రైతులు ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు

రైతులు ఢిల్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హర్యానా, పంజాబ్ కు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు నివ్వడంతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను దాదాపుగా మూసివేశారు. హస్తినకు వచ్చే మార్గాల్లో పెద్దయెత్తున పోలీసు బలగాలు మొహరించాయి. కేంద్ర ప్రభుత్వంతో నిన్న జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. హర్యానా, ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రైతులు వస్తారని అంచనా వేస్తున్నారు.
డిమాండ్లు ఇవే...
పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించేందుకు చట్టం చేయాలని, స్వామినాధన్ సిఫార్సులను అమలు చేయాలని, 2020లో తాము జరిపిన ఆందోళనల సమయంలో తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్న ప్రధాన డిమాండ్లతో చలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో సరిహద్దుల్లో పోలీసులు భారీ బలగాలను మొహరించి పహారా కాస్తున్నాయి. సిమెంట్ దిమ్మెలతో పాటు ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. దీంతో దేశ రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story

