Sat Mar 07 2026 10:13:39 GMT+0530 (India Standard Time)
Amitabh : అమితాబ్ కు ఫ్యాన్స్ వేడుకోలు... ఆ పని చేయవద్దంటూ
బిగ్ బి అమితాబ్ కు అభిమానులు షాకిచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్స్ ను మీరు చూడవద్దంటూ అభిమానులు కోరుతున్నారు

బిగ్ బి అమితాబ్ కు అభిమానులు షాకిచ్చారు. వరల్డ్ కప్ ఫైనల్స్ ను మీరు చూడవద్దంటూ అభిమానులు కోరుతున్నారు. అమితాబ్ మ్యాచ్ చూస్తే భారత్ ఓడిపోతుందన్న సెంటిమెంట్ ఉంది. అందుకే అమితాబ్ ను ఆయన అభిమానులు వరల్డ్ కప్ ఫైనల్స్ చూడవద్దంటూ కోరుతున్నారు. అమితాబ్ జీ ప్లీజ్ మీరు మాత్రం ఫైనల్స్ చూడవద్దంటూ మొరపెట్టుకుంటున్నారు. ఈ ఆదివారం ఇండియా - ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆయనే చెప్పడంతో...
ఇదే విషయాన్ని అమితాబ్ కూడా చెప్పారు. తాను సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై నేను చూడనప్పుడే మనం గెలుస్తాం అని ఆయన కామెంట్స్ చేసిన తర్వాతనే అభిమానులు ఫైనల్స్ చూడవద్దంటూ మొరబెట్టుకుంటున్నారు. జట్టు కోసం ఈసారి కూడా త్యాగం చేయాలని, వరల్డ్ కప్ ఫైనల్స్ చూడవద్దని అమితాబ్ ను వేడుకుంటున్నారు. అయితే అమితాబ్ మాత్రం ఆ మ్యాచ్ కు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నానంటూ మరో ట్వీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు అభిమానులు కూడా బెంబేలెత్తిపోతున్నారు.
Next Story

