Fri Mar 21 2025 20:37:11 GMT+0000 (Coordinated Universal Time)
Vijaykanth : నేడు విజయ్‌కాంత్ అంత్యక్రియలు
ప్రముఖ తమిళనటుడు విజయకాంత్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

ప్రముఖ తమిళనటుడు విజయకాంత్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. విజయ్‌కాంత్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు డీఎండీకే కేంద్ర కార్యాలయంలో విజయ్ కాంత్ అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.
వేలాది మంది అభిమానులు...
విజయ్‌కాంత్ గత కొంత కాలంగా అస్వస్థతకు గురయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. ఆయనను చివరి సారిగా చూసేందుకు వేలాది మంది అభిమానులు తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. విజయ్‌కాంత్ కు నివాళులర్పించేందుకు పెద్దయెత్తున సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story