Thu Dec 18 2025 23:01:32 GMT+0000 (Coordinated Universal Time)
లతకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
ప్రముఖ గాయని లతామంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి

ప్రముఖ గాయని లతామంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని శివాజీ పార్కులో బంధుమిత్రులు, అభిమానుల మధ్య అంత్యక్రియలను నిర్వహించారు. భారతరత్న లతా మంగేష్కర్ ను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆమె పాట విని పెరగిన వాళ్లంతా ముంబయి చేరుకుని ఆమెను చివరి చూపు చూసి తల్లడిల్లి పోయారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.
మోదీతో పాటు....
ప్రధాని నరేంద్ర మోదీ లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన లతను చవరి సారిగా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మోదీకి లతా మంగేష్కర్ పాటలంటే ఇష్టం. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుటుంబం లత అంత్యక్రియలకు హాజరయింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, షారూఖ్ ఖాన్ దంపతులు, మహారాష్ట్ర మంత్రులు మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులను లతకు కన్నీటి వీడ్కోలు పలికారు.
Next Story

