Fri Jan 30 2026 06:36:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆడపిల్ల పుట్టిందని.. ప్రత్యేక హెలికాప్టర్ లో....?
తాజాగా పూనేలో ఆడపిల్ల పుట్టిందని తెలిసిన కుటుంబ సభ్యులు ఆ పాపను ఇంటికి తెచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశారు

కొందరికి ఆడపిల్ల పుట్టింది అంటే ముఖం మాడ్చేసుకుంటారు. మరికొందరు లక్ష్మీ దేవి పుట్టిందని గట్టిగా నమ్ముతారు. ఆడపిల్ల పుడుతుందని తెలిసి ముందుగానే అబార్షన్ చేయించే వారు ఎందరో ఉన్నారు. అయితే నిబంధనలను కఠిన తరం చేయడం, శిక్షలు అమలు చేస్తుండటంతో కొంత ఆడపిల్ల పట్ల వివక్ష తగ్గిందనే చెప్పాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివిక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది.
లక్ష్మీదేవి పుట్టిందని....
మహారాష్ట్రలో మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే పండగ చేసుకుంటారు. వారికి ఇక వ్యాపారపరంగా, ఉద్యోగ పరంగా కలసి వస్తుందని విశ్విస్తారు. తాజాగా పూనేలో ఆడపిల్ల పుట్టిందని తెలిసిన కుటుంబ సభ్యులు ఆ పాపను ఇంటికి తెచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. జనవరి 22న భొసారి పట్టణంలో విశాల్ జరేకర్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. అందుకే చిన్నారికి ఘన స్వాగతం చెప్పేందుకు ఆసుపత్రి నుంచి ఇంటికి హెలికాప్టర్ లో వచ్చామని గర్వంగా చెప్పారు.
- Tags
- girl child
- pune
Next Story

