Sat Dec 13 2025 19:29:03 GMT+0000 (Coordinated Universal Time)
Exit Polls : బీహార్ ఎన్డీఏదే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కే
బీహార్ అసెంబ్లీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి

బీహార్ అసెంబ్లీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అత్యధికంగా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు అనుకూలంగా వచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జేవీసీ ఎగ్టిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 130 నుంచి 150 స్థానాలు వస్తాయని తెలిపింది. మహా ఘట్ బంధన్ కు మాత్రం 88 నుంచి 103 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జనసురాజ్ పార్టీ ఒకటి రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశముందని అంచనా వేసింది.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో...
మ్యాట్రిజ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని తెలిపింది. మహా ఘట్ బంధన్ కు 70 నుంచి 90 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని తెలిపింది. మరొక వైపు జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. చాణ్యక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు వస్తాయని తెలపింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ కే అనుకూలంగా వస్తున్నాయి.
Next Story

