Fri Dec 05 2025 19:32:49 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : విమాన ప్రమాదానికి కారణాలన్నీ ఊహాగానాలే...అవన్నీ నిజం కావు
అహ్మదాబాద్ లో కూలిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలి వందల సంఖ్య మరణించిన ఘటనలో అసలు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు

అహ్మదాబాద్ లో కూలిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలి వందల సంఖ్య మరణించిన ఘటనలో అసలు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నారు. బ్లాక్ బాక్స్ కూడా ఇంకా లభించకపోవడంతో దాని కోసం వెదుకుతున్నారు. ఈ విమాన ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విచారణ చేపట్టింది. బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప టేకాఫ్ అయిన సమయంలో విమానం కూలిన కారణాలు తెలిసే అవకాశం లేదు. అయితే అనేక కారణాలను మాజీ పైలెట్లు చెబుతున్నారు.
వాయిస్ రికార్డింగ్...
కాక్ పిట్ వాయిస్ రికార్డింగ్ డేటా వ్యాలిడిటీ కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటుందని మాజీ పైలెట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఫ్లైట్ డేటా రికార్డింగ్ డేటా వ్యాలిడిటీ కేవలం 25 గంటలు మాత్రమే ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగి దాదాపు ఇరవై మూడు గంటల సమయం గడుస్తుంది. దీంతో కాక్ పిట్ వాయిస్ రికార్డింగ్ డేటా, ఫ్లైట్ డేటా రికార్డింగ్ ల నుంచి కారణాలు తెలియడం కష్టమేనంటున్నారు. కాక్ పిట్ వాయిస్ లో ఇద్దరు పైలెట్లు ఏం మాట్లాడుకున్నారన్న విషయం తెలుస్తుంది.
కారణంపై నో క్లారిటీ...
లాస్ట్ ఆప్షన్ గా మాత్రము మేడే అని సంకేతాన్ని పంపుతారు. కానీ ఏటీసీ రెస్పాన్స్ అయ్యే సమయంలోపు విమానం కూలిపోవడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. కెప్టెన్ హెల్ప్ లెస్ గా ఉన్నప్పుడు మాత్రమే మేడే అనే పదం ఉపయోగిస్తారు. అందుకే ఇప్పుడు అనుకుంటున్నవన్నీ ఊహాగానాలేనని, దర్యాప్తు తర్వాత మాత్రమే పూర్తి వివరాలు తెలుస్తాయని మాజీ పైలెట్లు చెబుతున్నారు. టేకాఫ్ కాగానే క్లాష్ అయింది కాబట్టి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియవని చెబుతుండటంతో పూర్తి కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ అన్నీ ఊహాగానాలే తప్పఏదీ నిజం కాదన్నది నిపుణుల అభిప్రాయం.
Next Story

