Mon May 20 2024 03:56:35 GMT+0000 (Coordinated Universal Time)
గాలి జనార్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్
మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఆయన వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది
మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది. ఆయన వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ నిబంధనను సడలించాలని గాలి జనార్థన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తనను బళ్లారి, కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఆయన పిటీషన్ లో కోరారు.
ఆరు నెలల్లో...
అయితే గాలి జనార్థన్ రెడ్డి పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. వెంటనే కేసుకు సంబంధించి ట్రయల్ ను ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని చెప్పింది. అయితే గాలి జనార్థన్ రెడ్డి మాత్రం బళ్లారిలో నెల రోజులు ఉండేందుకు మాత్రం అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Next Story