Tue Jan 20 2026 18:16:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఉద్ధవ్ కు షాక్.. కుటుంబం నుంచే?
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మరో షాక్ తగిలింది. మహారాష్ట్రలో శివసేనను క్రమంగా ఏక్నాథ్ షిండే తన పరం చేసుకుంటున్నారు

మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మరో షాక్ తగిలింది. మహారాష్ట్రలో శివసేనను క్రమంగా ఏక్నాథ్ షిండే తన పరం చేసుకుంటున్నారు. తాజాగా ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగిలింది. బాల్ థాక్నే మనవడు నిహార్ థాక్రే ముఖ్యమంత్రి షిండేను కలిశారు. ఆయనకు తన మద్దతు ప్రకటించారు. ఉద్ధవ్ థాక్రే సోదరుడి కుమారుడే నిహార్ థాక్రే. ఉద్థవ్ కుటుంబంలోనూ చీలిక కనపడుతుంది. శివసేనను తన పరం చేసుకునేందుకు షిండే చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నట్లే కనిపిస్తుంది.
ఎంపీలను ....
శివసేనకు చెందిన ఎంపీలను కూడా తన వర్గంగా మార్చుకునేందుకు షిండే ప్రయత్నించారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగానే ఇది జరగాల్సి ఉన్నా ఉద్ధవ్ థాక్రే దిగి వచ్చి వారు చెప్పినట్లు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపడంతో ఇంకా వారు శివసేన వీడలేదు. రేపో మాపో వారు కూడా ప్రత్యేక వర్గంగా ఏర్పడే అవకాశముంది. శివసేనను ఇబ్బంది పెడుతున్న షిండేపై ఆగ్రహంగా ఉన్నా ఉద్ధవ్ ఏమీ చేయలేకపోతున్నారు. ఆయన త్వరలో రాష్ట్ర పర్యటనకు వెళతారని తెలుస్తోంది.
Next Story

