Sun Mar 22 2026 00:53:21 GMT+0530 (India Standard Time)
ఆశలు ఇక లేవు.. సుప్రీంకోర్టులో షాక్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. అన్నా డీఎంకే పగ్గాలు పళనిస్వామికేనంటూ సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడంతో పన్నీర్ సెల్వానికి పార్టీలో ఇబ్బందులు తప్పేలా లేవు. గత కొన్నాళ్లుగా పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య ఆధిపత్యపోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.
పార్టీ పగ్గాలు...
పార్టీ పగ్గాలు తమకే దక్కాలంటూ ఇరు వర్గాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అయితే పార్టీ మాత్రం పళనిస్వామికే చెందుతుందని మద్రాస్ హైకోర్టు చెప్పిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో పన్నీర్ సెల్వం చివరి ఆశలు కూడా అడుగంటాయి.
Next Story

