Fri Dec 05 2025 12:58:33 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka results : ఓటమిని అంగీకరించిన బొమ్మై
కర్ణాటక ఎన్నికల్లో తాము అనుకున్న మేర స్థానాలను సాధించలేకపోయాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

కర్ణాటక ఎన్నికల్లో తాము అనుకున్న మేర స్థానాలను సాధించలేకపోయాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ఆయన ఎన్నికల కౌంటింగ్ సరళిపై విశ్లేషించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో ఓటమిపై తాము విశ్లేషించుకుంటామని చెప్పారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఆయన చెప్పారు.
లోక్సభ ఎన్నికల నాటికి...
ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై దృష్టి పెడతామని బసవరాజు బొమ్మై తెలిపారు. పార్టీ ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకుని ముందుకు వెళతామని ఆయన తెలిపారు. ఈ ఓటమికి తాము కుంగిపోవడం లేదని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు.
Next Story

